ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రైవేటు కళాశాలల్లో బి-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, ఫార్మ-డి, ఫార్మ-సిబి కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన జిఓను విడుదల చేసింది. 2023-24 నుంచి 2025-26 వరకు ఈ ఫీజులు అమల్లో ఉంటాయి. బి-ఫార్మాసీ 177 కళాశాలల్లో కనీస ఫీజు రూ.38 వేలు, గరిష్టంగా రూ.80 వేలను ప్రభుత్వం నిర్ధారించింది. 102 ఎం-ఫార్మ కళాశాలల్లో కనీస ఫీజు రూ.60 వేలుగా, గరిష్టంగా రూ.90 వేలుగా నిర్ణయించింది. ఫార్మ-డి 62 కళాశాలల్లో కనిష్టంగా రూ.38 వేలు, గరిష్టంగా రూ.65 వేలు, ఫార్మ-పిబి కళాశాలల్లో కనిష్ట ఫీజు రూ.42 వేలు, గరిష్టంగా రూ.80 వేలుగా నిర్ధారించింది.










