కొలంబో : మూడో, చివరి వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్, వికెట్ కీపర్లు అర్ధశతకాలతో కదం తొక్కారు. దీంతో టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(60; 86బంతుల్లో 4ఫోర్లు, సిక్సర్), ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (67; 79బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లో అఘా సల్మాన్(38 నాటౌట్), మహ్మద్ నవాజ్(30) దంచి కొట్టడంతో అఫ్గనిస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గన్ బౌలర్లలో గుల్బదిన్ నబీ, ఫరీద్ అహ్మద్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మూడు వన్డేలో పాక్ బ్యాటర్లు చెలరేగారు. 36 పరుగుల వద్ద ఫకర్ జమాన్, 52 పరుగుల వద్ద ఇమాముల్ హక్(13) ఔటయ్యారు. ఆ తర్వాత బాబర్, రిజ్వాన్ మరో వికెట్ పడకుండా ఆడారు. అర్ధసెంచరీలు బాది మూడో వికెట్‌కు 110 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో, పాక్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఫరీద్, గులాబుద్దీన్‌కు రెండేసి, రషీద్, ముజీబ్, ఫరూఖీకు ఒక్కో వికెట్ దక్కాయి.










