Oct 18,2023 12:12

బెంగళూరు: పాకిస్థాన్‌ జట్టులో చాలామంది జ్వర పీడితులుగా ఉన్నారని పీసీబీ మీడియా మేనేజర్‌ అషాన్‌ ఇఫ్తికార్‌ తెలిపారు. కొంతమందికి కాస్త నయం కాగా.. కొందరు ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని ఆయన తెలిపారు. కాగా పాక్‌.. అక్టోబర్‌ 20న ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఇప్పటికే మ్యాచ్‌ వేదిక బెంగళూరుకు ఆ జట్టు చేరుకుంది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, స్టార్‌ పేసర్‌ షహీన్‌షా అఫ్రిది కొంత మంది జట్టు సభ్యులు చిన్నస్వామి స్టేడియంలో సాధన చేశారు.