Sep 21,2023 21:48

హైదరాబాద్‌ : సంతానోత్పత్తి సంరక్షణను మెరుగుపర్చడానికి కూపర్‌ సర్జికల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఫెర్టీ9 వెల్లడించింది. గర్భధారణ విజయాల రేటును పెంచడానికి ఈ భాగస్వామ్యం దోహదం చేయనుందని పేర్కొంది. చికిత్స పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరించే లక్ష్యంతో జట్టుకట్టినట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో ఫెర్టి9కు ఏడు సెంటర్లు ఉన్నట్లు వెల్లడించింది. సంతానోత్పత్తి చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులకు కూపర్‌సర్జికల్‌ భాగస్వామ్యం మద్దతును అందించనుందని తెలిపింది.