
నాంపల్లి (హైదరాబాద్) : హైదరాబాద్‌లోని నాంపల్లిలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ ఇంజిన్ల సాయంతో అక్కడకు చేరుకొని మంటలను అదుపుచేసే చర్యలు చేపట్టారు. మంటల్లో మరికొందరు కార్మికులు కూడా చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. మఅతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం సంభవించడానికి గల పూర్తి కారణాలు, వివరాలు తెలియారాలేదు. పోలీసులు విచారణ చేపట్టారు.
