- ఒక్క సారి ఛార్జ్‌తో 80 కిలోమీటర్లు
న్యూఢిల్లీ : విద్యుత్ వాహన బ్రాండ్ ఒకాయ ఇవి మార్కెట్లోకి కొత్తగా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్‌ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఈ వాహనాన్ని ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 70-80 కిలోమీటర్లు ప్రయాణించడానికి వీలుందని ఆ సంస్థ పేర్కొంది. గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందని తెలిపింది. ఆరు రంగుల్లో లభించే దీని ఎక్స్‌షోరూం ధరను రూ.83,999గా నిర్ణయించినట్లు ఒకాయ ఎలక్ట్రిక్ వెహికల్స్ వెహికల్స్ ఎండి అన్షుల్ గుప్తా పేర్కొన్నారు. అత్యుత్తమ నాణ్యత, విశ్వసనీయమైన ఇవిల కోసం అనేక ఉన్నత ప్రమాణాలను పాటించామని ఆయన తెలిపారు.










