కెన్యా : లా కోర్సు చేయయకుండానే వేరొకరి నంబర్‌మీద ఓ ఉన్నత న్యాయవాద సంస్థలో లాయర్‌గా తన పేరు నమోదు చేసుకుని ప్రాక్టీసు చేస్తున్న నకిలీ న్యాయవాది భాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన కెన్యాలో చోటుచేసుకుంది. పేరు నమోదు చేసుకోవడమే కాకుండా తన క్లయింట్ల తరపున వాదించి 26 కేసులలో విజయం సాధించాడు. కెన్యా లా సొసైటీ అతనిని అనుమానించిన నేపధ్యంలో అతని మోసపూరిత చర్యలు వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళితే.. ¸కెన్యాకు చెందిన బ్రియాన్ మ్వెండా న్జాగ్తి లా కోర్సు పూర్తి చేయకుండానే వేరొకరి నంబర్‌తో ఓ ఉన్నత న్యాయవాద సంస్థలో లాయర్‌గా తన పేరు నమోదు చేసుకున్నాడు. తన క్లయింట్ల తరపున వాదించి 26 కేసులలో విజయం సాధించాడు. అతను నిజమైన న్యాయవాది కాదని న్యాయమూర్తులు కూడా గుర్తించలేకపోవడం విశేషం. బ్రియాన్ అనే నిజమైన న్యాయవాది తాను ప్రాక్టీస్ చేయకపోయినా తన ఖాతా యాక్టివ్‌గా ఉండటాన్ని చూసి, అతను కెన్యా లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుదారు అటార్నీ జనరల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అందుకే అతనికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ అవసరం లేకపోవడంతో అతను తన ఖాతాను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే ఒకరోజు అతను తన ఖాతా లాగిన్ చేసినప్పుడు, అతనికి అనుమానం వచ్చింది. దీంతో అతను లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అతని పేరు మీద మరొకరు లాయర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. లా కోర్సు చేయకుండానే బ్రియాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో నకిలీ న్యాయవాదిని అరెస్ట్ చేశారు.