ప్రజాశక్తి-గణపవరం (ఏలూరుజిల్లా) : జ్ఞానేద్రియాలలో కళ్ళు ప్రదానమైనవని కంటి చూపు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని గణపవరం ఎంఇఒ పి.శేషు అన్నారు. కాశిపాడు హైస్కూలలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఫోన్‌లు ఎక్కువగా వాడటం వల్ల కంటిచూపులో సమస్యలు రావటం జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్ హైస్కూలలో127 మంది విద్యార్థులకు కంటి పరిక్షలు నిర్వహంచగా వారిలో 6 గురు విద్యార్థులక దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వారికి అమసరమైన కళ్ళ జోళ్లను త్వరలోనే అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపాల్ బికాంతిశ్రీ, గణపవరం సిఎచ్‌ఓ జే.విల్సన్ బాబు, నేత్రవైద్యులు, ఐ.శ్రీనివాస్, ఆరోగ్య సహయకులు నామాలరాజు, ఎంఎల్ ఎచ్.పి.రమ్యశ్రీ, ఎన్.ఎం.శివకుమారి తదితరులు పాల్గొన్నారు.










