న్యూఢిల్లీ : చక్కెర ఎగుమతులపై విధించిన ఆంక్షలను పొడిగించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) తెలిపింది. గతంలో విధించిన గడువు అక్టోబర్ 31తో ముగియనుంది. ఆ తర్వాత కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అదే విధంగా ఇప్పటికే ఉన్న నిల్వల సమాచారాన్ని అందించాలని వ్యాపారులను ఆదేశించింది. ప్రస్తుత పండగ సీజన్ నేపథ్యంలో దేశీయంగా తగినన్ని చక్కెర నిల్వలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిజిఎఫ్‌టి తెలిపింది.