Feb 28,2023 21:24

ముంబయి : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కొత్తగా 100 గోల్డ్‌ లోన్‌ శాఖలను ఏర్పాటు చేసినట్లు కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది. దీంతో దేశంలో 500 శాఖల మైలురాయికి చేరినట్లయ్యిందని ఆ బ్యాంక్‌ తెలిపింది. ప్రస్తుత మార్చి ముగింపు నాటికి మరో 50 శాఖలను తెరువాలని లక్ష్యంగా పెటుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 253 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. పసిడి రుణాలు వ్యక్తిగత, వ్యాపార అవసరాలను తీర్చడంలో కీలకంగా మారాయని కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ లిమిటెడ్‌ కమర్షియల్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ మనీష్‌ కొఠారి పేర్కొన్నారు.