Sep 29,2023 21:25

కలబురగి : ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ దక్షిణాదిలో 200 శాఖలకు విస్తరించినట్లు ప్రకటించింది. కర్నాటకలోని కలబురగిలో కొత్త శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఈ మైలురాయికి చేరినట్లు పేర్కొంది. డిజిటల్‌ బ్యాంకింగ్‌, విభిన్న ఆదాయ మార్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఖాతాదారులను పెంచుకుంటున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా 686 శాఖలతో 22 లక్షల మంది ఖాతాదారులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.