ప్రజాశక్తి - బిజినెస్ బ్యూరో:గృహ రుణాల జారీ సంస్థ ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ కంపెనీ (ఐసిఐసిఐ హెచ్‌ఎఫ్‌సి) తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా రాష్ట్రంలో 12 శాఖలకు విస్తరించినట్లు ప్రకటించింది. కొత్తగా ఏలూరులో శాఖను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. స్థానికులకు విస్తృత శ్రేణీ గృహ రుణాలు, ఇంటి అభివృద్థి, తనఖా, కార్యాలయాల ఏర్పాటుకు అప్పులు ఇవ్వనున్నట్లు తెలిపింది. 2018లో ఎపిలో తన కార్యకలాపాలను ప్రారంభించినట్లు వెల్లడించింది.










