న్యూఢిల్లీ : బ్యాంక్‌ల్లో రూ.2,000 నోట్ల మార్పిడిని నిలిపివేసిన నేపథ్యంలో ఆర్‌బిఐ రీజినల్ ఆఫీసుల ముందు జనం వరుస కడుతున్నారు. తమ కార్యాలయానికి వెళ్లకుండా నోట్లను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయవచ్చని ఆర్‌బిఐ పేర్కొంది. దగ్గర్లో ఆర్‌బిఐ కార్యాలయం లేని వాళ్లు పోస్టల్ శాఖ సర్వీసు ద్వారా నోట్లను తమకు పంపవచ్చని పేర్కొంది. టిఎల్‌ఆర్ ఫామ్ ద్వారా రూ.2 వేల నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది.