Apr 27,2023 12:22

ప్రజాశక్తి-ఉంగుటూరు(ఏలూరు) : ఉంగుటూరు మండలం తిమ్మయ్యపాలెంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న చెరువు అభివద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వ పిఆర్‌ అండ్‌ ఆర్డి సలహాదారుడు నాగార్జున రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో ఆయన మాట్లాడారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకుంన్నారు. ఈసందర్భంగా ఎండా కాలంలో ఉపాధి పనుల సమయాన్ని తగ్గించాలని కూలీలు కోరారు. ఈ కార్యక్రమంలో ఏంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పీడి రాము, విజిలెన్స్‌ అధికారిని ఏవీ విజయలక్ష్మి, ఇంఛార్జి ఎంపిడిఓ ఆంజనేయులు వెంట గ్రామ సర్పంచ్‌, ఇతర అధికారులు ఉన్నారు.