న్యూఢిల్లీ : ఆపిల్ కంపెనీ భారత్‌లో తొలిసారి తయారు చేసిన ఐఫోన్లను విడుదల చేయనుంది. ఐఫోన్ 15ను సెప్టెంబర్ 12 రాత్రి ఆవిష్కరించింది. ఇతర దేశాలతో పాటు భారత్‌లోనూ ఈ ఫోన్ అమ్మకాలను ప్రారంభించనుందని సమాచారం. గత నెలలో దక్షిణ తమిళనాడులోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ముంబయిలో తొలిసారి తన అధికారిక రిటైల్ స్టోర్‌ను కూడా ఆపిల్ ప్రారంభించింది. ఐఫోన్ 15 ధర రూ.90వేల లోపు ఉండొచ్చని అంచనా.