తిరుపతి : ఆటోమోటివ్ మాన్యుఫాక్చరర్స్ సంస్థ రేణిగుంటలో తన అత్యాధునిక సర్వీసు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించినట్లు తెలిపింది. అశోక్ లేలాండ్ సంస్థకు సంబంధించిన అతి పెద్ద డీలర్లలో ఆటోమోటివ్ ఒకటి. ఈ ప్రాంతంలోని వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో తన నిబద్ధతను కొనసాగించనున్నట్లు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి తెలిపారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద వాణిజ్య వాహనాల వర్క్ షాప్ తమదేనని పేర్కొన్నారు. దీంతో 104 సర్వీసు టచ్ పాయింట్లకు నెట్‌వర్క్‌ను విస్తరించినట్లయ్యిందన్నారు.