Oct 21,2023 13:42

రీస్‌ టాప్లీ బౌలింగ్‌లో 5 పరుగులు చేసిన మిల్లర్‌ బెన్‌స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో సౌతాఫ్రికా 245 పరుగుల వద్ద 5వ వికెట్‌ కోల్పోయింది. క్రీజులోకి మార్కో జాన్సెన్‌ వచ్చాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 31 బంతుల్లో 40 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • మర్కారమ్‌ ఔట్‌

233 వద్ద సౌతాఫ్రికా 4వ వికెట్‌ను కోల్పోయింది. 44 పరుగులు చేసిన మర్కారమ్‌ టోప్లీ బౌలింగ్‌లో జానీ బెయిర్‌సోకు క్యాచ్‌ ఇచ్చి పెవలియన్‌కు చేరాడు. క్రీజులోకి మిల్లర్‌ వచ్చాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ 35 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

33 ఓవర్లు పూర్తి

33 ఓవర్లు పూర్తయ్యే సరికి సౌతాఫ్రికా 219 పరుగులు చేసింది. మర్కారమ్‌ 38 బంతుల్లో 38 పరుగులు, హెన్రిచ్‌ క్లాసెన్‌ 22 బంతుల్లో 30 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • 30 ఒవర్లకు 190

30 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా 192 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ 13 పరుగులు, మర్కారమ్‌ 28 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • రీజా హెండ్రిక్స్‌ 85 ఔట్‌

85 పరుగులు చేసిన రీజా హెండ్రిక్స్‌ ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రీజా హెండ్రిక్స్‌ 75 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ సాయంతో 85 పరుగులు చేశాడు. క్రీజులోకి హెన్రిచ్‌ క్లాసెన్‌ వచ్చాడు. మర్కారమ్‌ 13 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 23 ఓవర్లకు సౌత్రాఫ్రికా 156/2

23 ఓవర్లకు సౌతాఫ్రికా 156 పరుగులు చేసింది. జోరూట్‌ వేసిన 23వ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. రీజా హెండ్రిక్స్‌ 66 బంతుల్లో 88 పరుగులు, ఐడెన్‌ మార్క్రామ్‌ 7 బంతుల్లో 9 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ ఔట్‌

61 బంతుల్లో 60 పరుగులు చేసిన రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ ఆదిల్‌ రషీద్‌ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఐడెన్‌ మార్క్రామ్‌ వచ్చాడు.. ప్రస్తుతం 20 ఓవర్లు పూర్తయ్యే సరికి సౌత్రాఫ్రికా 126 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్‌ 56 బంతుల్లో 59 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 15 ఓవర్లకు సౌత్రాఫ్రికా 91/1

15 ఓవర్లు సౌత్రాఫ్రికా 91 పరుగులు చేసింది. రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ 44 బంతుల్లో 43 పరుగులు చేయగా.. రీజా హెండ్రిక్స్‌ 44 బంతుల్లో 43 పరుగులు చేశాడు.

  • 10 ఓవర్లు పూర్తి.. సౌత్రాఫ్రికా 59/1

10 ఓవర్లు పూర్తయ్యే సరికిక సౌత్రాఫ్రికా వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ 32 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. రీజా హెండ్రిక్స్‌ 28 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 25 పరుగులు చేశాడు. మరోవైపు వికెట్‌ కోసం ఇంగ్లాండ్‌ బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • రీస్‌ టాప్లీకి తొలి వికెట్‌.. క్వింటన్‌ డి కాక్‌ ఔట్‌

సౌత్రాఫ్రికాకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ క్వింటన్‌ డి కాక్‌ రీస్‌ టాప్లీ బౌలింగ్‌లో రెండో బంతికే పెవలియన్‌ చేరాడు. తొలి బంతి ఫోర్‌ కొట్టిన క్వింటన్‌ డి కాక్‌ రెండో బంతిని షాట్‌ ఆడే ప్రయత్నంలో కీపర్‌ జోస్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రాస్సీ 0వాన్‌ డెర్‌ డస్సెన్‌ వచ్చాడు.

  • టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌

ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌-సౌత్రాఫ్రికా మధ్య ఈ రోజు మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో సౌత్రాఫ్రికా కెప్టెన్‌ బవుమా ఆనారోగ్య కారణంగా ఆడకపోవడంతో మార్కరమ్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బవుమా స్థానంలో రీజా హెండ్రిక్స్‌ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌ జట్టులో ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ జట్టులోకి వచ్చాడు. వోక్స్‌, కుర్రాన్‌ స్థానంలో విల్లీ, అట్కిన్సన్‌ జట్టులో చేరారు.
ఇంగ్లాండ్‌ : జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, హ్యారీ బ్రూక్‌, జోస్‌ బట్లర్‌, డేవిడ్‌ విల్లీ, ఆదిల్‌ రషీద్‌, గుస్‌ అట్కిన్సన్‌, మార్క్‌ వుడ్‌, రీస్‌ టాప్లీ
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డి కాక్‌, రీజా హెండ్రిక్స్‌, రాస్సీ వాన్‌ డెర్‌ డస్సెన్‌, ఐడెన్‌ మార్క్రామ్‌(సి), హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, మార్కో జాన్సెన్‌, గెరాల్డ్‌ కోయెట్జీ, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబాడ, లుంగీ న్గిడి