Oct 10,2023 10:42

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి. మొయిన్‌ అలీ స్థానంలో రీస్‌ టాప్లే బరిలోకి దిగుతుండగా.. బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మహ్మదుల్లా స్థానంలో మెహది హసన్‌ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు..
ఇంగ్లండ్‌: జానీ బెయిర్‌స్టో, డేవిడ్‌ మలన్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, జోస్‌ బట్లర్‌(కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్‌, సామ్‌ కర్రన్‌, క్రిస్‌ వోక్స్‌, ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌, రీస్‌ టాప్లే

బంగ్లాదేశ్‌: తంజిద్‌ హసన్‌, లిట్టన్‌ దాస్‌, నజ్ముల్‌ హొస్సేన్‌ షాంటో, షకీబ్‌ అల్‌ హసన్‌(కెప్టెన్‌), మెహిదీ హసన్‌ మిరాజ్‌, ముష్ఫికర్‌ రహీమ్‌(వికెట్‌కీపర్‌), తౌహిద్‌ హదొరు, మెహది హసన్‌, తస్కిన్‌ అహ్మద్‌, షోరిఫుల్‌ ఇస్లాం, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌