
ఛండీగడ్: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు బోణీకొట్టింది. లీగ్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్.. మంగళవారం జరిగిన రెండో లీగ్‌లో బంగ్లాదేశ్‌పై 137పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్ 48.2ఓవర్లలో 227పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ లిటన్ దాస్(76), ముష్ఫికర్ రహీమ్(51) అర్ధసెంచరీలతో మెరిసారు. రెండో ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ తంజీద్ హసన్ ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే నజ్ముల్ హొసేన్ శాంటోను కూడా ఖాతా తెరవకుండానే టోప్లీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత మెహిదీ హసన్ మిరాజ్ కూడా సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్ 26పరుగులకే 3వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ముష్ఫికర్ రహీమ్ (51; 4 ఫోర్లు), టోవిడ్ హృదరు (39; 2ఫోర్లు) పర్వాలేదనిపించారు. టోఫ్లేకు నాలుగు, క్రిస్ వోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఇంగ్లండ్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలాన్ శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలివికెట్‌కు 115 పరుగులు జతచేశారు. ఆ దశలో షకీబ్ ఉల్ హసన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో (52; 8 ఫోర్‌లు) క్లీన్ బౌల్డయ్యాడు. తర్వాత జోరు రూట్ వన్ డౌన్‌గా వచ్చి డేవిడ్ మలాన్‌కు జత కలిశాడు. ఈ ఇద్దరు కూడా 151 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన తర్వాత మెహదీ హసన్ బౌలింగ్‌లో మరో సెంచరీ హీరో డేవిడ్ మలాన్ (140; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత భారీ స్కోర్ చేసే క్రంలో ఇంగ్లండ్ బ్యాటర్‌లు వెంటవెంటనే వికెట్లు పారేసుకున్నారు. జోరు రూట్ (68; 8 ఫోర్‌లు, సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. మెహిదీ హసన్‌కు నాలుగు, షోరిఫుల్ ఇస్లామ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డేవిడ్ మలన్‌కు లభించింది.
వన్డే ప్రపంచకప్‌లో నేడు..
భారత్ × ఆఫ్ఘనిస్తాన్
(వేదిక: ఢిల్లీ; మ.2.00గం||లకు)