Jun 04,2023 10:56

పాందువ (పశ్చిమ గోదావరి) : పాందువ గ్రామం ఉపాధి పనుల సమస్యపై కెవిపిఎస్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మాదాసి గోపి మాట్లాడుతూ .... ఉపాధి హామీ పనులు సంవత్సరానికి 200 రోజులు ఇవ్వాలని, రెండు పూటలా పని విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పనిచేస్తున్న వ్యక్తికి 600 రూపాయలు కూలి ఇవ్వాలని, వేసవికాలంలో సమ్మర్‌ అలవెన్స్‌ 50 రూపాయలు అదనంగా కలపాలని చెప్పారు. వడగాల్పులకు టెంట్లు, మజ్జిగ, మంచినీళ్లు సరఫరా చేయాలని, గ్రామంలో ఉన్న ఉపాధి కార్మికులకు పని ఇవ్వాలన్నారు. ఎస్సీలుగా ఉన్నవారు వ్యవసాయం పనులు లేక ఇబ్బందిపడుతున్న బతుకుతెరువు కష్టమవుతున్న ఉపాధి కార్మికులకు ఎక్కువకాలం పని చెప్పాలని అన్నారు. ప్రస్తుతం నాలుగో వారాలు పని చెప్పారని తెలిపారు. జూన్‌ 5వ తారీఖు నుంచి ఉపాధి పని లేదని చెప్పారు. ఉపాధి హామీ అధికారులు గమనించి పని ఎస్సీ పేటలో ఉపాధి పనులు లేకుండా ఉన్న వారికి పని కల్పించాలని కోరారు. పాందువ ఎస్సి పేట గ్రూపుల అధికారులకు తెలియజేయడమైనది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ గ్రూపు సభ్యులందరూ పాల్గొన్నారు.