కె.కోటపాడు (విశాఖ) : కే కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలపై చెరువు వద్ద కూలీలతో ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు మాట్లాడారు. శనివారం నాయనబాబు మాట్లాడుతూ ... ఉపాధి కూలీలకు బడ్జెట్లో నిధులు 60 వేల కోట్ల రూపాయలు కుదించారని అన్నారు. 2014 కేంద్ర మోడీ ప్రభుత్వం రాకముందు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి పథకం బడ్జెట్లో నిధులు ఉండేవని.. అవి 2023 వరకు 60 వేల కోట్లు రూపాయలకు కుదించింది మోడీ ప్రభుత్వం అని విమర్శించారు. మెటీరియల్ కాంపౌండ్ చార్జీలు ఎక్కువ చేస్తున్నారని అన్నారు. ఉపాధి నిధులతో సచివాల బిల్డింగులు, సీసీ రోడ్డు నిర్మాణం, అంగన్వాడి భవనాలకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. గ్రామీణ పంచాయతీ రాజ్ నుండి సిసి రోడ్లు కానీ పైన పేర్కొన్న బిల్డింగులకు గాని రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, రోజు కూలి 400 రూపాయలు ఇచ్చి 200 రోజులు పని దినాలు కల్పించాలని, రెండు పూటలా పని విధానానికి స్వస్తి చెప్పి, పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. గునపం, పార, తట్ట, మంచినీళ్లు, సమర అలవెన్సు, అదనంగా డబ్బులు ఇవ్వాలని, పేమెంట్ పే స్లిప్స్, పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సింగందోరపాలెం శివారు కొత్తూరు గ్రామంలో వనం సూర్యనారాయణ ఉపాధి హామీ కూలీల సమస్యలను తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో మండల ప్రజా సంఘాల కన్వీనర్ ఎర్ర దేవుడు, వే.చలకుఆచ్చిబాబు, రోంగలి సత్యం, రోంగలి జగ్గారావు, లెక్కల సన్యాసిరావు, చౌడువాడ పాతరపల్లి విజయ, చిలిపిరిశెట్టి చిన్నమ్మలు, వెంకటలక్ష్మి, తనకాల పద్మ, ది నూక రత్నం, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.










