Feb 14,2023 21:26

ముంబయి : సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ లింక్డిన్‌లోనూ ఉద్యోగుల కోత మొదలయ్యిందని తెలుస్తోంది. నియామక శాఖలోని ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. కాగా.. ఎంత మందిని తొలగించేది ఆ సంస్థ వెల్లడించలేదు. 2023 ప్రారంభంలో టెక్‌ రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించిన ఈ సంస్థ ఇప్పుడు తిరిగి ఉద్వాసనలకు పాల్పడటం ఆందోళనకరం. దీనికి సంబంధించి లింక్డిన్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.