కీ.శే. మలిశెట్టి సీతారామ్ గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఔత్సాహిక రచయితల నుంచి కథలను ఆహ్వానిస్తున్నాం. బహుమతి పొందిన కథలతో బాటు మరి కొన్ని ఎంపిక చేసిన కథలతో 'కథా ప్రపంచం 2023' పుస్తకం ప్రచురించబడుతుంది. మలిశెట్టి సీతారామ్ స్మారక సాహితీ పురస్కారం 2023 విజేత వివరాలు, కథల పోటీ విజేతల వివరాలు సంయుక్తంగా ప్రకటిస్తాం. కథల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 5 వేలు, రూ. 3 వేలు, రూ. 2 వేలు ఉంటాయి. కథలు చేరడానికి చివరి తేదీ : జులై 15, 2023. ఏ ప్రాంతంలోని తెలుగువారైనా ఈ కథల పోటీలో పాల్గొనవచ్చు. కథలు పంపాల్సిన చిరునామా : పలమనేరు బాలాజీ, పలమనేరు రచయితల సంఘం, 6/219 గుడియాత్తం రోడ్, పలమనేరు - 517408, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. వివరాలకు : యుగంధర్ : 93947 82540, శాస్త్రి : 88857 62720
- మలిశెట్టి శ్యామ్ ప్రసాద్,
99850 13234










