న్యూయార్క్ : కృత్రిమ మేధా (ఎఐ)తో ఉద్యోగాలు భారీగా కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ హెచ్చరించారు. ఎఐ చరిత్రలో అత్యంత వినాశనకారిగా మిగిలిపోతుందని విశ్లేషించారు. ఇటీవల బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌తో భేటీ అయిన మస్క్ ఈ ఆధునిక టెక్నాలజీ మానవాళికి పెను ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారని రిపోర్టులు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో మనుషులు చేసే అన్ని ఉద్యోగాలను కనుమరుగు చేస్తుందని మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎఐతో అసలు ఉద్యోగాలు అవసరం లేని దశకు చేరుకునే ప్రమాదం లేకపోలేదన్నారు.