Jun 07,2023 12:56

అల్లూరి : రాబోయే జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో గోదావరి వరదలు వచ్చిన సమయంలో నెలల తరబడి ఏజెన్సీ గ్రామాలు నీట మునిగిన గ్రామాలతో పాటు వరదలు ఎఫెక్ట్‌ కానీ గ్రామాలు కూడా కరెంటు లేక అంధకారంలో ఉండవలసి వస్తున్నదని, కావున విద్యుత్‌ డిపార్ట్మెంట్‌ అధికారులు తక్షణము స్పందించి రాబోయే మూడు నెలల కాలంలో వరదలు వచ్చిన కరెంటు సప్లై ఇవ్వటం కోసం చింతూరు నుండి కుందులూరు మీదుగా గతంలో పూర్వం ఒక లైన్‌ ఉండేది. దాని ద్వారా కుందులూరు నుండి వరద ముంపుకు గాని ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ రేఖపల్లి హెడ్‌ కోటర్‌ వరకు కరెంటు ఇచ్చేవారు దాని వలన వరదలు వచ్చిన విద్యుత్‌ సప్లై ఉండేది వరద బాధితులు ఎక్కువ శాతం రేకపల్లి కేంద్రంగా అలాగే మునగని గిరిజన గ్రామాల్లో కేంద్రాలుగా వరద బాధితులు కేంద్రాలు కు విద్యుత్‌ ఉపయోగపడటం కోసం గతంలో ఉన్న పాత లైన్లను ఉపయోగించేవారు. ఇప్పుడు వరదలు వచ్చినా విద్యుత్‌ ఇవ్వటం కోసం గతంలో మాదిరిగానే రిపేరు చేసి కరెంటు లైన్లు పునరుద్ధరణ చేయాలని, వరదలు వచ్చిన రేకపల్లి హెడ్‌ కోటర్‌ వరకు కరెంటు సప్లై ఇవ్వటానికి పై అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రజలను అంధకారం నుంచి కాపాడాలని అలాగే చిన్న గాలి దుమ్ము వచ్చిన కరెంటు అంతరాయం తరచుగా వస్తున్నదని, ఇలాంటి మిస్టేక్స్‌ కూడా లేకుండా విద్యుత్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. వరదలు ఎదుర్కోవటానికి ముఖ్యంగా విద్యుత్‌ డిపార్ట్మెంట్‌ పూర్తిగా సన్నద్ధం కావాలి అని మండలం ఎంపీపీ కారం లక్ష్మి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి చిన్న బాబు, ఏ ఎస్‌ఆర్‌ జిల్లా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌, మండల కమిటీ సభ్యులు కారం సుందరయ్య, పంకు సత్తిబాబు, సోడి మల్లయ్య, తదితరులు పాల్గన్నారు.