Apr 21,2023 09:51

న్యూఢిల్లీ : దేశంలోని పలు ప్రాంతాలలో ఈ సంవత్సరం మార్చి నెలలోనే వేసవి తన ప్రతాపం చూపించింది. ఈ నెలలో అయితే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ కారణంగా విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉంటోంది. మరోవైపు రాత్రి సమయాలలో డిమాండ్‌ కంటే సరఫరా 1.7 శాతం తక్కువగా ఉంది. రాత్రి సమయంలో గరిష్టంగా 217 గిగా వాట్ల (ఒక గిగా వాట్‌ అంటే బిలియన్‌ వాట్లు) విద్యుత్‌ డిమాండ్‌ ఉంటోంది. ఇది గత సంవత్సరపు గరిష్ట డిమాండ్‌ కంటే 6.4 శాతం అధికం. ఈ దశలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి పరిస్థితిని కొంత చక్కదిద్దే అవకాశం ఉంది.