- కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజీ
ప్రజాశక్తి- అరకులోయ రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన పివిటిజి కుటుంబాల స్థితిగతులు, జీవన విధానంపై కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజీ ఆరా తీశారు. మంగళవారం మండలంలోని బొండం పంచాయతీ రేగ గ్రామంలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు అందుతున్నాయా లేదా అని అడిగితెలుసుకున్నారు. రేగ గ్రామస్తులు మాట్లాడుతూ.రైల్వే ట్రాక్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామంలో రోడ్డు, మంచి నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. పిల్లులు స్కూల్ కి, గ్రామస్తులు వ్యవసాయం కోసం వెళ్ళాలన్నా రైల్వే ట్రాక్ దాటి వెళ్లాల్సి వస్తుందన్నారు. రైల్వే ట్రాక్ కింద నుండి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.రైతులు పండిచే ప్రతీ పంటను గిట్టుబాటు ధరలు కల్పించి ఐటీడీఏ పంటను కోనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డిప్యూటీ కార్యదర్శి రాజీ మాట్లాడుతూ, గిరిజన పివిటిజి గ్రామాలకు రహదారి, రక్షిత మంచినీటి, రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.అంగన్వాడి కేంద్రంలో పౌష్ఠికాహారం అందించాలని ఐసిడిఎస్ అధికారులను ఆదేశించారు. కాపీ, మిరియాలు ప్రభుత్వ ఐటిడిఎ కోనుగోలు చేస్తోందని చెప్పారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు అతి త్వరలో పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ఐటీడీఏ ఏపీవో మాట్లాడుతూ, పిటిజి గ్రామాలకు అన్ని సదుపాయాలు కల్పించేందుకు వివరాలు సేకరించడం జరుగుతుందన్నారు. మంచినీరు, వ్యవసాయ పనిముట్లు, రుణ సహకారం సబ్సిడీతో పిటిజి కుటుంబాలకు త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన డిప్యూటీ సెక్రెటరీ చంద్రిక, ఐటీడిఏ ఏపీఓ, తహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో నగేష్, ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ అభిషేక్, ఆర్‌డబ్ల్యు ఏఈ వినీల, సర్పంచ్ డి భాస్కరరావు, ఏటిడబ్ల్యూ మలికార్జున, సచివాలయం ఉద్యోగులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










