Aug 04,2023 21:40

ప్రజాశక్తి-పుల్లంపేట (అన్నమయ్య జిల్లా) :మధురై నుంచి ఓఖా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు రావడంతో అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని రెడ్డిపల్లె రైల్వేస్టేషన్‌లో శుక్రవారం మధ్యాహ్నం రైలు బండిని నిలిపివేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు హుటాహుటిన బోగీల్లో నుంచి కిందకు దిగారు. బ్రేకులు గట్టిగా అతుక్కుపోవడం వల్ల పొగలు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 20 నిమిషాల తర్వాత యథావిధిగా రైలు బయలుదేరింది.