ప్రముఖ కవి విమర్శకులు డా.యాకూబ్ ... ఎదిరెపల్లి మశమ్మ స్మారక పురస్కారం 2022కు ఎంపికైనట్లు అధ్యక్షులు ఎదిరెపల్లి కాశన్న తెలిపారు. 2022 డిసెంబర్ 18న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే సభలో రూ.20 వేల నగదుతో పాటు శాలువా, మెమెంటోతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హాజరవుతారని తెలిపారు.










