Aug 10,2023 12:26

జకార్తా (ఇండోనేషియా) : ఇండోనేషియాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే (యుఎస్‌జిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాలోని మలుకు ప్రావిన్స్‌లోని టువల్‌ అనే నగరానికి 142 కి.మీ దూరంలో గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో సంభవించినట్లు యుఎస్‌జిఎస్‌ వెల్లడించింది. టువల్‌ నగరం కీ దీవులలో ఉందని యుఎస్‌జిఎస్‌ తెలిపింది. 270 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన ఇండోనేషియాలో అగ్నిపర్వతాలు, సునామీలు, భూకంపాలు వంటి విపత్తులు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. ప్రపంచంలోని మొత్తం అగ్ని పర్వతాల్లో మూడింట రెండు వంతులు, భూకంపాల్లో 90 శాతం ఈ దేశంలోనే సంభవిస్తాయని జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.