అండమాన్ - నికోబార్ : అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. పొడవు : 9.32 , పొడవు : 94.03, పది కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తన ట్వీట్‌లో పేర్కొంది. అయితే భూకంపం సంభవించడం వల్ల.. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదని ఎన్‌సిఎస్ పేర్కొంది.










