అండమాన్ నికోబార్ : అండమాన్ సముద్రంలో శుక్రవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే... శుక్రవారం మధ్యాహ్నం 12.07 గంటల సమయంలో అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. వెడల్పు 9.43, పొడవు 94.20, పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తన అధికారిక 'ఎక్స్'లో పోస్ట్ చేసింది.