కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం 10.05 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు 36.41, పొడవు 70.44, 173 కిలోమీటర్ల లోతులో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది అని ఎన్‌సిఎస్ అధికారిక 'ఎక్'్సలో ట్వీట్ చేసింది.
కాగా, ఆగస్టు 18వ తేదీన ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌కి పశ్చిమాన 423 కిలోమీటర్ల దూరంలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే మరోసారి ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించడం గమనార్హం.