మునుగోడు ఉప ఎన్నికలో భారీగా అవినీతి జరిగిందని,వెంటనే ఈ ఎన్నికను రద్దు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. చండూర్ మున్సిపాలిటీలోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటింగ్ కోసం ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ పెట్టమని అడిగినా అధికారులు పట్టించుకోలేదన్నారు. అధికారులు తెరాస పక్షనా పనిచేశారని విమర్శించారు. కేటీఆర్ దత్తత తీసుకోవడం అంటే ఇక్కడి భూముల ఆక్రమించడం, అమ్ముకోవడం, రూ.లక్షల కోట్లు దోచేయడమేనంటూ మండిపడ్డారు.