Oct 19,2023 21:12

న్యూఢిల్లీ : పండగ సీజన్‌ నేపథ్యంలో అమేజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2023 ఆన్‌ లైన్‌ షాపింగ్‌ వినియోగదారులకు అమేజాన్‌ పే 'రుపే క్రెడిట్‌ కార్డ్స్‌పై ఈఎంఐ'ని పరిచయం చేసింది. ఎనిమిది బ్యాంక్‌లు జారీ చేసే రూపే క్రెడిట్‌ కార్డులపై ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నామని అమెజాన్‌ పే ఇండియా క్రెడిట్‌ అండ్‌ లెండింగ్‌ డైరెక్టర్‌ మయాంక్‌ జైన్‌ తెలపారు. తమ ఖాతాదారులకు అమేజాన్‌ పే లేటర్‌, అమేజాన్‌ పే వాలెట్‌, యుపిఐ తదితర చెల్లింపు ఆప్షన్స్‌ను కల్పిస్తున్నామన్నారు.