Jul 15,2023 11:41

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : కడప ప్రజా రవాణా శాఖ కార్యనిర్వాహక సంచాలకులు గిడుగు వెంకటేశ్వరరావు పీలేరు ఆర్టీసీ డిపోను తనిఖీ చేశారు. శనివారం ఆయన డిపో కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఉద్యోగులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యూఎఫ్‌ నాయకుడు హెచ్‌ఎన్‌.బాబు 1/209 సర్క్యులర్‌ అమలు చేయాలని, పీలేరు ఆర్టీసీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, పీలేరు నుంచి దూర ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడపాలని, డిపోలో సస్పెండైన నలుగురు డ్రైవర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్‌ బండ్ల కుమార్‌, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.