Nov 16,2023 11:01

న్యూఢిల్లీ  :   న్యూస్‌ క్లిక్‌ ఆరోపణలపై అమెరికన్‌ వ్యాపారి నెవెల్లీరాయ్  సింగమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సమన్లు జారీ చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈడి సమన్లు పంపినట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. షాంఘైలో ఉంటున్న నెవెల్లీరాయ్ కి సమన్లకు సంబంధించి ఇ-మెయిల్‌ కూడా పంపినట్లు పిటిఐ వార్తా సంస్థ పేర్కొ ఢిల్లీ కోర్టు లెటర్‌ రొగేటరీని ( సహాయం కోసం చైనా కోర్టులకు సాధారణ అభ్యర్థన ) జారీ చేసిన అనంతరం ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. గతేడాది చైనా అధికారులు ప్రత్యక్ష సమన్లు జారీ చేసేందుకు నిరాకరించారు.
.

చైనా అనుకూల వార్తలు ప్రసారం చేసేందుకు చైనా అనుసంధాన సంస్థల నుండి నిధులను స్వీకరించిందని ఆరోపిస్తూ ఉగ్రవాద వ్యతిరేక చట్టం- యుఎపిఎ కింద ఢిల్లీ పోలీసులు న్యూస్‌ క్లిక్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, అమిత్‌ చక్రవర్తిలపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మోడీ సర్కారు మీడియాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని పలు మీడియా సంస్థలు, జర్నలిస్టులు, మేధావులు విమర్శిస్తున్నారు.