హైదరాబాద్ : ప్రస్తుత పండగ సీజన్‌ను అందిపుచ్చుకోవడానికి స్మార్ట్ మొబైల్ ఫోన్ల రిటైల్ చెయిన్ లాట్ మొబైల్స్ భారీ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని లాట్ మొబైల్స్ డైరెక్టర్ ఎం అఖిల్ తెలిపారు. వినియోగదారులు కొనుగోళ్లపై ఖచ్చితమైన బహుమతితో పాటు రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందే వీలుందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన మోడల్ మొబైల్స్, ఇతర వస్తువులను కొనుగోలు చేసే వారికి జీరో డౌన్ పేమెంట్‌తో కూడిన రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. 24 నెలల వ్యవధితో కూడిన నో కాస్ట్ ఇఎంఐ సదుపాయాన్ని ఎంచుకోవచ్చన్నారు. అదే విధంగా రూ.999కే స్మార్ట్ వాచ్, సౌండ్ బార్ ఊఫర్‌తో కూడిన స్మార్ట్ టి కాంబో ఆఫర్, అన్ని బ్రాండెడ్ యాక్సెసరీలు, ఇతర వస్తువుల కొనుగోళ్లపై 60 శాతం వరకు తక్షణ డిస్కౌంట్‌ను ఇస్తున్నామని అఖిల్ తెలిపారు. రూ.8,999 ప్రారంభ ధరతో స్మార్ట్ టివి, రూ.16,500 ధరతో ల్యాప్‌టాప్‌లు లభించనున్నాయని కంపెనీ మరో డైరెక్టర్ సుప్రజ వెల్లడించారు. స్మార్ట్ టివిపై రూ.7,499 వరకు, ల్యాప్‌టాప్‌పై రూ.4 వేల వరకు క్యాష్‌బ్యాక్, స్మార్ట్ టివిని కొనుగోలు చేసిన వారికి రూ.17,999 విలువైన సౌండ్ బార్ ఊఫర్‌ను కేవలం రూ.5,999కే అందిస్తున్నామన్నారు. డెబిట్ కార్డ్‌పై రూ.1 డౌన్‌పేమెంట్‌తోనూ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ ఆఫర్లను వినియోగదారులు ఉపయోగించుకోవాలన్నారు.