Oct 23,2023 12:39

అమరావతి : విజయం సాధించేవరకు పోరాడటమే దసరా స్ఫూర్తి అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భార్య బ్రాహ్మణి సోమవారం ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు.

'' మహిషాసురుడి అంతానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసింది. విజయం సాధించేవరకు పోరాడటమే దసరా స్ఫూర్తి. కలియుగ అసురులను అంతమొందించేవరకు పోరాడదాం '' అని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌కు 'దేశం చేస్తోంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం' పోస్టర్‌ను ఆమె జత చేశారు.