May 26,2023 11:47

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఎస్డబ్ల్యుఎఫ్‌ చీరాల శాఖ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... ఆర్టీసీ కార్మికులకు, సిక్కులకు జీతాలు రెగ్యులర్‌గా చెల్లించాలని, అలాగే పాత పద్ధతిలో వైద్య సౌకర్యం కల్పించాలని, నెట్‌ కెపాసిటీని పెంచాలని పలు సమస్యలపై డిమాండ్‌ చేశారు. క్యాడర్‌ స్ట్రెంత్‌ పేరుతో అక్రమ బదిలీలను ఆపాలని, ఆర్టీసీకి సంబంధించిన బకాయిలన్నీ ప్రభుత్వం చెల్లించాలని తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకొని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, పలువురు పాల్గొన్నారు.