నా పేరు రిహాన్ అహ్మద్. మా అమ్మా, నాన్నల పేర్లు రెహానా, అసేన్. నేను మర్తాడు ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నా. చదువుతో పాటు ఆటలు ఆడడం ఇష్టం. బొమ్మలు గీయడమంటే మరీ ఇష్టం. ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ ద్వారా జరిగిన పోటీల్లో పాల్గొన్నా. ఫస్ట్‌టైం మంచి బహుమతి వచ్చింది. ఇదివరకూ నేను నాలుగైదు పోటీల్లో పాల్గొన్నా బహుమతి రాలేదు. అయినా నేను నిరుత్సాహ పడలేదు. పోటీ పాల్గొనడమే గొప్ప విషయం అని మా అమ్మా, నాన్న చెబుతుండేవారు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా ఎంతో మెచ్చుకున్నారు. జాతీయ స్థాయిలో జరిగిన పోటీలో మంచి బహుమతి రావడం ఎంతో ఆనందంగా ఉంది. మా వెంకటరమణ సార్ మాకు చదువుతో పాటు బొమ్మలు గీయడం కూడా నేర్పుతారు. మా పాఠశాల్లో జరిగిన అభినందన సభలో మా మండల విద్యాధికారి శ్రీ తారాచంద్రా నాయక్ సార్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నా. మా అమ్మ, నాన్న ఎంతో సంతోషించారు. నా స్నేహితులు అభినందించారు.
- రిహాన్ అహ్మద్, 4వతరగతి,
ఎంపిపి పాఠశాల,మర్తాడు మెయిన్,
గార్లదిన్న, అనంతపురం.










