Apr 03,2023 07:37

దేశభక్తి - పురోగతి - జాతీయత ప్రధానాంశాలుగా కవితల పోటీ నిర్వహించాలని పాలపిట్ట - వాసా ఫౌండేషన్‌ సంకల్పించాయి. సుప్రసిద్ధ సాహితీవేత్త డా. వాసా ప్రభావతి సంస్మరణార్థం నిర్వహించ తలపెట్టిన ఈ పోటీకి అమృతోత్సవాల సందర్భమే ప్రధాన వస్తువు. రూ. 3 వేలు, రూ.2 వేలు, రూ. వెయ్యి చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. రూ.500 చొప్పున 8 ప్రత్యేక బహుమతులు ఉంటాయి. దేశభక్తిని పెంపొందించే అంశాలకు ప్రాధాన్యం కుల, మతాల విభేదాలని మరచి శాంతి సామరస్యాలతో ప్రజలంతా పురోగామిపథంలో ప్రయాణించాలన్న భావనలకు బలం చేకూరే అంశాలు వస్తువుగా ఉండటం ఉపయుక్తం. వచన కవితలు ఎన్ని లైన్లయినా ఉండొచ్చు. కవితలు పంపించడానికి చివరి తేదీ : 30 ఏప్రిల్‌ 2023. పంపించాల్సిన చిరునామా : ఎడిటర్‌, పాలపిట్ట, ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500 044. ఫోను : 94900 99327. palapittamag@gmail.com