
తన ప్రత్యేక శైలితో కథ, నవలా ప్రపంచాన్ని అబ్బురపరచిన విలక్షణ రచనాశీలి డాక్టర్ వి.చంద్రశేఖరరావు మరణించి ఆరు సంవత్సరాలు కావ స్తోంది. ఏప్రిల్ 13 వారి జయంతి సందర్భంగా ఏటా వర్ధమాన సాహిత్య కారునికి ఆయన పేరున సాహిత్య పురస్కారాన్ని చంద్రశేఖరరావు సాహితీ కుటుంబం ప్రదానం చేస్తోంది. 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని నల్గొండకు చెందిన యువ కథా రచయిత వి.మల్లికార్జున్‌కి ప్రదానం చేయాలని నిర్ణయించారు. గతంలో ఈ పురస్కారాన్ని ఎండపల్లి భారతి, సుంకోజి దేవేంద్రాచారి, ఇండ్ల చంద్రశేఖర్, దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి పొందారు.
- డాక్టర్ వి.ప్రసూన,
డాక్టర్ వి.చంద్రశేఖర రావు సాహిత్య కుటుంబం