Feb 27,2023 20:56

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లాబరేటరీస్‌ తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మేనే ఫార్మా గ్రూపునకు చెందిన అమెరికా జెనరిక్‌ ప్రిస్క్రిప్షన్‌ ప్రొడక్ట్‌ పోర్టుపోలియోను స్వాధీనం చేసుకోనుంది. దీని కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. ఇందుకోసం 105 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.860 కోట్ల) చెల్లింపులు చేయనుంది. మేనే ఫార్మా అమెరికా జెనరిక్స్‌ ప్రిస్కిప్షన్‌ ప్రొడక్ట్‌ పోర్ట్‌పోలియోలో సుమారు 85 జెనరిక్‌ ఉత్పత్తులు ఉన్నాయి. మేనే ఫార్మా దక్కడంతో రోగులకు తక్కువ ధరలకే మందులను అందించడానికి వీలుందని డాక్టర్‌ రెడ్డీస్‌ పేర్కొంది.