2023 సంవత్సరానికి రచయిత్రి అరుణ గోగులమండ, జర్నలిస్ట్ తులసి చందులకి డా. పుట్ల హేమలత స్మారక పురస్కారం ప్రకటించారు. ఫిబ్రవరి 9న హేమలత వర్ధంతి సందర్భంగా పురస్కారాలు అందిస్తున్నట్లు మనోజ్ఞ సాంస్క ృతిక సాహిత్య వేదిక అధ్యక్షురాలు ఎండ్లూరి మానస తెలిపారు. రచయిత్రి పుట్ల హేమలత పేరు మీద 2019 నుంచి వివిధ రంగాల్లో కృషి చేస్తున్న మహిళలకు ఈ పురస్కారాలు ఇస్తున్నారు.










