ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ (తిరుపతి) : పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి అనస్తీషియా డాక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ నవీన్ (45) అనారోగ్య కారణంగా చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో శుక్రవారం మృతి చెందారు. వీరి కుటుంబం మొత్తం వైద్య వృత్తిలోనే ఉన్నారు. అతి చిన్న వయసులోనే డాక్టర్ గా అందరి మన్ననలు పొందిన నవీన్ అకాల మృతికి ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్స్, నర్సులు, సిబ్బంది శనివారం సంతాపం తెలిపారు. పుత్తూరు పట్టణంలోని డాక్టర్ రవిరాజ్ , డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, డాక్టర్ సుభాషిని శ్రీధర్ రాజు, డాక్టర్ హైమావతి, శ్రీనివాసులు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రభావతి, నరసింహులు, డాక్టర్ వర్మ, జయలక్ష్మి, డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ లోకనాథం, డాక్టర్ ముని రాజా, పలు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, మిత్రులు, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.










