న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఆగస్ట్‌లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి భారీగా తగ్గగా.. మరోవైపు సౌదీ అరేబియా నుంచి దాదాపు రెట్టింపు ముడి చమురు దిగుమతి పెరిగిందని ప్రభుత్వ గణంకాలు తెలిపాయి. రష్యా నుంచి వరుసగా మూడో నెలలో చమురు దిగుమతులు తగ్గి.. ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆగస్టులో ప్రతి రోజూ 1.46 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ దిగుమతి చేసుకున్న భారత్.. జూలైలో 1.91 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకుది. ఇరాక్ నుంచి జూలైలో 8.91 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగిమతైతే.. ఆగస్టులో 8.66 లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. కానీ సౌదీ అరేబియా నుంచి ప్రతి రోజూ 4.84 లక్షల బ్యారెళ్ల నుంచి 8.20 లక్షల బ్యారెళ్ల క్రూడ్ దిగుమతి పెరగడం విశేషం.










