లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బిజెపి ఎంపి, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై చర్య తీసుకోవాలంటూ పోరాడుతున్న రెజ్లర్లు, వారికి మద్దతు తెలిపిన మహిళా, రైతు సంఘాలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని ఢిల్లీ పోలీసులు దమనకాండకు పాల్పడ్డారు. బ్రిజ్‌భూషణ్ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరు కాగా.. ఆందోళన నిర్వహిస్తున్న రెజ్లర్లపై పోలీసులు విరుచుకుపడ్డారు.












