
తరచూ మోకాళ్లు నొప్పిగా ఉంటున్నాయా ? తస్మాత్ జాగ్రత్త. ఏముందిలే అని లైట్‌గా తీసుకోవద్దు. వర్షాకాలం, శీతాకాలంలో మోకాళ్లు నొప్పిగా ఉంటే ఎంతమాత్రం అశ్రద్ధ చేయొద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా చలికాలం లేదా వర్షాకాలం వచ్చినప్పుడు చాలామందిలో కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధిస్తుంటాయి. మరోవైపు అసలు వాతావరణంలో మార్పులకు కీళ్ల నొప్పులకు ఎలాంటి సంబంధం లేదనే అధ్యయనాలు లేకపోలేదు.
వాతావరణంలో తేమగా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కీళ్లు దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా మందపాటి దుస్తులను ధరించాలి.
శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
స్నానం వేడినీళ్లతో చేయాలి.
స్టీమ్ బాత్‌లు కూడా మంచి ఉపశమనం కలిగిస్తాయి.
మోకాలి నొప్పి ఎందుకు వస్తుంది ?
అసలు వాస్తవం ఏంటంటే.. కీళ్లలో ఆర్థరైటిస్ సమస్య అధికంగా ఉన్నవారిలో చల్లగా లేదా వర్షంగా ఉన్నప్పుడు మోకాళ్లలో నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. బారో మెట్రిక్ పీడనంలో కూడా భారీ మార్పులు కనిపించాయి. శరీరంలోని కండరాలు, కణజాలంపై ప్రభావం పడి నొప్పికి దారితీస్తాయని గుర్తించారు. ఆర్థరైటిస్ భారిన పడిన వారిలో మోకాలి నొప్పి తీవ్రంగా ఉంటుందని డాక్టర్లు ధృవీకరిస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కీళ్లలో సైనోవియల్ ద్రావణాన్ని చిక్కగా చేస్తాయని అందుకే నొప్పిగా అనిపిస్తాయని స్పష్టం చేశారు.
మోకాళ్లలో ఉంటే సైనోవియల్ ప్లూయిడ్ 10 డబ్లు 40 వరకు అవసరం ఉంటుంది.. జాయింట్ల మధ్య కీళ్లు అటు ఇటు కదిలేటప్పుడు సున్నితంగా ఉండేందుకు ఈ ద్రావణం సాయ పడుతుంది. ఒకవేళ ఈ ద్రావణం కానీ చిక్కబడితే మాత్రం జాయింట్ కీళ్లలో బిగుతుగా పట్టేసినట్టు అనిపిస్తుంటుంది..
మోకాలి నొప్పిని అశ్రద్ధ చేయొద్దు
మోకాలి నొప్పిగా అనిపించినప్పుడు.. కొంచెం కూడా అశ్రద్ధ చేయొద్దు.. వాతావరణం బాగోలేని సమయంలో మోకాలికి గాయమైతే తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వారిలో మోకాలినొప్పి ఎందుకు వస్తుందో గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆర్థరైటిస్ సమస్య కారణంగా చాలామందిలో మోకాలి నొప్పిలకు దారితీస్తుందని చెబుతున్నారు. అందుకు మోకాలు నొప్పిగా అనిపిస్తే.. అది ఎందుకు ఏ కారణం వల్ల వస్తుందో ముందుగా నిర్ధారించుకునే ప్రయత్నం చేయాలి.
ప్యామిలీ డాక్టర్ విధానంతో గ్రామీణులకు వైద్యసేవలు
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో కీళ్ల సమస్య ఒకటి. పరుగుల జీవితం, జీవన విధానంలో వైవిధ్యం, సరైన వ్యాయామం లేకపోవటం, ఆహారపు అలవాట్ల అసమతుల్యం వంటివి అనారోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. వర్షకాలం వచ్చినప్పుడు వానలు కురవడానికి ముందు వాతావరణంలో గాలి పీడనం తగ్గిపోతుంది. శరీరంపై కూడా గాలి పీడనం తగ్గుతుంది. దీని ఫలితంగా కండరాలు, కీళ్ల చుట్టూ ఉండేటువంటి ఇతర కణజాలాలు వ్యాకోచించడం మొదలుపెడతాయి. చివరికి ఇది కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులకు దారి తీస్తోంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, దీర్ఘకాల నొప్పులతో బాధపడేవారు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటారు. వర్షాలు కురుస్తున్నప్పుడు బయటకు వెళ్లడం కుదరకపోవడంతో ఇంట్లోనే ఎక్కువ సమయం ఉండాల్సి వస్తుంది. కదలకుండా కూర్చోవడం వల్ల కండరాలు , కీళ్లు బిగుసుకుపోతాయి. దీనివల్ల ఇది నొప్పికి దారితీస్తుంది. అయితే ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. ఇలా చేస్తే కండరాలు, ఎములు బలోపేతం కావడమే కాకుండా కీళ్ల మీద ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోకుండా అటూ ఇటూ నడవడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనైనా నడవాలి. ట్రెడ్‌మిల్ మీద నడిచినా కూడా మంచిదే. బరువు పెరిగితే కూడా కీళ్లు, మోకీళ్ల మీద ఎక్కవగా భారం పడటంతో నొప్పులు ఎక్కువవుతాయి. అందుకోసమే అధిక బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ మాములు బరువు గనక ఉన్నట్లైతే పెరగకుండా జాగ్రత్తపడాలి. కీళ్ల నొప్పులు ఉన్నచోట గోరు వెచ్చని నీటిని సీసాలో పోసి దీనితో అద్దుకోవచ్చు. తువ్వాలను వేడి నీటిలో నుంచి ముంచి.. పిండిన తర్వాత కూడా అద్దుకోవచ్చు. అవసరమైతే హీటింగ్ ప్యాడ్స్ వాడుకోవచ్చు. గోరువెచ్చని నీటిని స్నానం చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. సాధరణంగా శరీరంలో నీటి శాతం తగ్గితే కీళ్ల కదలికలు సరిగ్గా సాగవు. అందుకోసమే రోజంతా అప్పుడప్పుడు నీరు తాగడం చాలా మంచింది.
- డాక్టర్ మేరుగ బాలాజీ