ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్‌జిల్లా) : నందిగామకు గౌస్ డ్రైవింగ్ స్కూలు అధినేత పఠాన్ గులాం గౌస్‌కు డాక్టరేట్ లభించింది. 2011 సంవత్సరం నుండి గౌస్ డ్రైవింగ్ స్కూలు నుండి వచ్చే ఆదాయాన్ని కొంత మొత్తం ప్రతి నెల నిరుపేదల పెళ్ళిళ్ళకు, నిరుపేదలకు సహాయం చేయటం,పలు సామాజిక సేవలు చేయటం గౌస్ ముందండటం పట్ల యూనివర్శిటీ టెక్సాస్ వారు గుర్తించి గౌస్‌కు డాక్టరేట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా గౌస్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అని, పేద ప్రజలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని , తాను చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి టెక్సాస్ యూనివర్శిటి డాక్టరేట్ ఇవ్వటం పట్ల ప్రత్యేక కృతజ్ఞతాలు తెలిపారు.










